News July 4, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి పాఠాలను చెప్పారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సరళ ఎమ్మెల్యేకు వివరించారు. సర్పంచ్ భాను, ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు.

Similar News

News December 12, 2025

శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

జిల్లాలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖుర్దా రోడ్డు డివిజన్‌లోని రాజ్ అథ్‌గర్, జోరాండా రోడ్డు మధ్య 3వ, 4వ లైన్ల ప్రారంభోత్సవం దృష్ట్యా విశాఖ-అమృత్సర్-విశాఖ (20807/08), గుణుపూర్-రూర్కెలా-గుణుపూర్(18117/18) రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ దారి మళ్లింపు ఈనెల 12, 13, 14, 16, 17, 19, 20వ తేదీలలో అమలులో ఉంటుందని GM పరమేశ్వర్ తెలిపారు.

News December 12, 2025

శ్రీకాకుళం: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా విఠల్

image

కూటమి ప్రభుత్వం 13 జిల్లాల గ్రంథాలయ చైర్మన్‌లను గురువారం రాత్రి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పలాస నియోజకవర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ రావును నియమించింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

News December 12, 2025

SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

image

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.