News December 28, 2024

శ్రీకాకుళం: విద్యుత్ ధర్నాకు గైర్హాజరైన వైసీపీ ముఖ్య నేతలు

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నాయకత్వంలో ధర్నాలు చేపట్టారు. కాగా.. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. పలువురు నేతలు కూడా గైర్హాజరయ్యారు.

Similar News

News January 1, 2025

శ్రీకాకుళం: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

image

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వివరాలు వెల్లడించారు. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 1, 2025

పలాస: బియ్యం గింజ సైజులో “వెల్కమ్ 2025” లోగో

image

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, బియ్యం గింజ సైజులో ‘వెల్కమ్ 2025 బంగారపు లోగో’ను తయారుచేశారు. పలాస-కాశీబుగ్గ గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మశిల్పి, స్వర్ణరత్న బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి. కేవలం 0.30 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి, కేవలం అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పు ఈ లోగో తయారు చేశారు. సుమారు ఐదు గంటల సమయం పట్టినట్లుగా రమేష్ మంగళవారం తెలిపారు.

News January 1, 2025

నూతన సంవత్సర శుభాకాంక్షలు: శ్రీకాకుళం ఎస్పీ

image

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు 2025 నూతన సంవత్సరంలో ఏర్పరుచుకున్న, నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి, వేడుకలను ప్రశాంతంగా ఇళ్ల వద్దనే జరుపుకోవాలన్నారు.