News October 7, 2024
శ్రీకాకుళం-విశాఖ మధ్య ప్రత్యేక రైలు

దసరా రద్దీ, విజయనగరం సిరిమాను ఉత్సవం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విశాఖ-శ్రీకాకుళం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. 10 నుంచి16వ తేదీ వరకు విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30కి శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) చేరుకుంటుందని, మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి 4 గంటలకు విశాఖ చేరుకుంటుందని తెలిపారు.
Similar News
News December 9, 2025
శ్రీకాకుళం: ఏపీ టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

శ్రీకాకుళం, బరంపూర్ గంజాం ఒడిశాలో జరగనున్న ఏపీ టెట్-2025 కంప్యూటర్ పరీక్షకు ఏడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం పదివేల 499 మంది అభ్యర్థులు హాజరవుతారని డీఈవో రవి బాబు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 10 నుంచి 21 వరకు రెండు పూటలు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 9221 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు MEOలను డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించారన్నారు.
News December 9, 2025
SKLM: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి

శ్రీకాకుళం జిల్లాలోని ఈనెల 13న అన్ని కోర్టుల్లో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, భూతగాదాలు రోడ్డు ప్రమాదాలు బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు విషయంలో వీలైనంతవరకు ఎక్కువమంది రాజీ పడే విధంగా సంబంధిత అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.
News December 9, 2025
ఎచ్చెర్ల: ప్రారంభమైన మూడో సెమిస్టర్ పరీక్షలు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 10 కోర్సులకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.లోకేశ్వరితో కూడిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.


