News October 24, 2024

శ్రీకాకుళం: ‘వైద్య సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండాలి’

image

జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లతో పాటు సిబ్బంది 24గంటలు విధి నిర్వహణలో ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి బుధవారం ఆదేశించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వైద్య సిబ్బందితో బుధవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. వైద్యసిబ్బందికి మంజూరు చేసిన సెలవులు గురువారం నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే విధుల్లోకి చేరాలని సూచించారు.

Similar News

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లా TODAY TOP NEWS

image

* శ్రీకాకుళం: కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
* మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించవచ్చు: SKLM SP
* శ్రీకాకుళం సుడా ఛైర్మన్‌గా రవికుమార్
* ఆమదాలవలస: 25ఏళ్లుగా ఇంట్లో పాము
* రాష్ట్రంలో నియంత పాలన: కృష్ణదాస్
* సోంపేట: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్
* ఇచ్చాపురం: వైసీపీ సీనియర్ నేత మృతి
* సీతంపేటలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం

News November 9, 2024

శ్రీకాకుళం: మెలకువలు పాటిస్తే కేసులను చేధించవచ్చు: SP

image

సైబర్ నేరాల నియంత్రణ, నేరాలకు సంబంధించిన కేసులను చేధించడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సరైన మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించటం చాలా సులుభం అవుతుందని అన్నారు.

News November 9, 2024

శ్రీకాకుళంలో నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..

image

ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను కూటమి ప్రభుత్వం శనివారం ఉదయం విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1. TDP నేత రోణంకి కృష్ణంనాయుడుని కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. 2.JSP నేత నుంచి పాలవలస యశస్విని తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా, కోరికాన రవికుమార్‌ను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.