News March 9, 2026
శ్రీకాకుళం: వైరల్.. సర్పంచ్‌గా గెలిపిస్తే ఫ్రీ WiFi అంట!

త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందసకి చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి ప్రకటించి హామీలు వైరల్ అవుతున్నాయి. గ్రామంలో వైఫై, సోలార్ లైటింగ్, ఆధునిక పార్కుల ఏర్పాటు వంటి ‘స్మార్ట్’ హామీలు ఇచ్చారు. అవినీతి లేని పాలన నుంచి యువతకు ఉపాధి వరకు గ్రామ బడ్జెట్‌కు మించి ఆయన ప్రకటించిన విజన్ చూసి, ఇది పల్లెటూరా లేక పారిస్ నగరా అని స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు. ఈ మ్యానిఫెస్టోపై మీ కామెంట్?
Similar News
News April 13, 2026
శ్రీకాకుళం: బైక్ స్కిడ్..ఒకరు దుర్మరణం

శ్రీకాకుళం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఎచ్చెర్ల- శ్రీకాకుళానికి బైక్‌పై వస్తుండగా ఆదిత్య పార్క్ ఎదురుగా స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్దారు. మృతి చెందిన వ్యక్తి గార మండలం బైరికి చెందిన రంగా రావు కాగా, గాయపడిన లక్ష్మణ రావు ఈ వివరాలను తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 13, 2026
నేడే SKLM-TPT హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు

శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇటీవల రైల్వే శాఖ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు)రైల్వే స్టేషన్-తిరుపతికి నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ ఇవాళ మధ్యాహ్నం 2-15ని.లకు ప్రారంభించనున్నట్లు ఆ కార్యాలయం నుంచి నిన్న ఓ ప్రకటన వచ్చింది. ఈ డైరెక్ట్ ట్రైన్ సర్వీస్‌కు ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల సాకారమవ్వనుంది.
News April 12, 2026
హిరమండలంలో జరిగిన దొంగతనంలో ట్విస్ట్

హిరమండలంలోని దేవరశెట్టి వీధిలో శనివారం భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారంలో <<19625168>>బిగ్ ట్విస్ట్<<>> నెలకొంది. చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపిన ఆభరణాలన్నీ ఇంటిలోనే ఉండటంతో అసలు చోరీయే జరగలేదని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం భారీ చోరీ జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో కొత్తూరు CI ప్రసాదరావు, SI మధుసూదనరావు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


