News September 19, 2024
శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ తాడేపల్లిలోని ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులుగా తమ్మినేని సీతారాం ని ప్రకటించారు. వారికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళం: డయేరియాపై ప్రభుత్వం సీరియస్

శ్రీకాకుళం పట్టణంలో ప్రబలిన డయేరియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఉన్నతస్థాయి నివేదిక తెచ్చుకున్న ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంపై అధ్యయనం చేస్తోంది. ముందుగా మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసింది. మరికొందరిపై వేటు వేసే అవకాశం ఉందన్న చర్చ అధికార యంత్రాంగంలో కొనసాగుతోంది. ప్రారంభంలో నియంత్రించలేక పోవటం వల్ల కేసులు పెరిగాయి అన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
News February 25, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.
News February 25, 2026
శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై వేటు

శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ హెచ్. కూర్మారావుపై ప్రభుత్వం వేటు వేసింది. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం డయేరియా ప్రధాన సమస్యగా మారింది. తాగునీటి సరఫరా, డయేరియా నిర్మూలనలో కమిషనర్ నిర్లక్ష్యంగా ఉన్నారని భావించి సస్పెండ్ చేశారు.


