News January 29, 2025

శ్రీకాకుళం: వ్యక్తిపై రాడ్డుతో దాడి

image

బావపై బావమరిది దాడి చేసన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళంలోని గోల్కొండరేవులో ఉన్న రామకృష్ణ, మొండేటీవీధికి చెందిన హేమలతను పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మంగళవారం అత్తవారి ఇంటికి వెళ్లిన రామకృష్ణ భార్య తనతో రావాలని గొడవ చేయగా బావ సతీష్ రాడ్డుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సై ఎం. హరికృష్ణ కేసు నమోదు చేశారు.

Similar News

News February 24, 2026

SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్‌డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్‌ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్‌షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.

News February 24, 2026

SKLM: గ్రీవెన్స్‌కు భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌లపైనే అధిక ఫిర్యాదులు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అత్యధిక శాతం భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పైనే అర్జీలను ఇచ్చేందుకు స్థానికులు జడ్పీ బాట పట్టారు. అయితే గతంలో వచ్చిన ఫిర్యాదులనే మళ్లీ చేస్తున్నామని, చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని పోలాకి జడ్పీటీసీ చైతన్య కలెక్టర్‌కు స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్‌కు విన్నవించడం గమనార్హం. అత్యధికంగా నరసన్నపేటలో భూ సమస్యలపై ఫిర్యాదులొచ్చాయి.

News February 24, 2026

శ్రీకాకుళం: బంగారం చోరీ చేసిన విద్యార్థులు

image

శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. నగరంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంట్లో చొరబడి 2తులాల బంగారం, రూ. 4వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా వన్ టౌన్ సీఐ పైడాపునాయుడు వారిని పట్టుకున్నారు. విద్యార్థులు మైనర్లు కావడంతో తల్లితండ్రులు అభ్యర్థన మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.