News April 17, 2024
శ్రీకాకుళం: శ్రీరామనవమి.. బంగారంతో సూక్ష్మ రామబాణం
శ్రీకాకుళంలోని పలాస మండలం కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామభక్తి చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బంగారంతో సూది మీద నిలబడే రామబాణంను మంగళవారం తయారుచేశారు. ఏటా వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజుల్లో ఆయా పండగలకు తగ్గట్టుగా సూక్ష్మ ఆకృతులు తయారుచేయడం అలవాటు అని చెబుతున్నారు.
Similar News
News February 1, 2025
డీజీపీని కలిసిన శ్రీకాకుళం ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శాంతిభద్రతలకు తీసుకున్న చర్యలను ఎస్పీ డీజీపీకి తెలియజేశారు.
News February 1, 2025
SKLM: ఓర్పు, సహనంతోనే లక్ష్యం సాధించగలం: ఎస్పీ
ఓర్పు, సహనంతోనే లక్ష్యం సాధించగలమని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక ఉమెన్స్ కాలేజీలో ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, సెల్ ఫోన్లు ద్వారా విజ్ఞానాన్ని పెంపుదించుకోవాలన్నారు. డీఎస్పీ సి.హెచ్ వివేకానంద ఉన్నారు.
News February 1, 2025
SKLMలో హెలికాప్టర్ టూరిజం
తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. రథసప్తమి వేడుకలు సందర్భంగా ఈ హెలికాప్టర్ టూరిజం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం, సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డచ్ బిల్డింగ్, కలెక్టరేట్ దగ్గర హెలికాప్టర్ రైడ్‌ను ఏర్పాటు చేశారు. రూ.1800తో 8 నిమిషాలపాటు రైడ్ ఉంటుందని అధికారులు తెలిపారు.