News May 11, 2024
శ్రీకాకుళం: సకల సౌకర్యాలతో పోలింగ్ కేంద్రాలు

పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించమని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ పేర్కొన్నారు. 8 నియోజకవర్గాల్లో 31 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేశామన్నారు. యువత కోసం నాలుగు, మహిళల కోసం పింక్ స్టేషన్లు 8, దివ్యాంగుల కోసం రెండు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి వీల్ చైర్లు సిద్ధం చేశామని కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News October 18, 2025
మందస: 22 నెలల చిన్నారికి వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం

కేవలం 22 నెలల అతి పిన్నవయసులోనే మందస మండలం డిమిరియాకు చెందిన సీర మయూరి అద్భుత ప్రదర్శన కనబరిచింది. మయూరి తండ్రి సీర సంజీవ్ సాఫ్ట్వేర్, తల్లి శాంతి డాక్టర్‌గా కాగా.. శ్లోకాలు, పద్యాలను ఇష్టంగా పాడుతున్న చిన్నారి ఆసక్తిని గమనించి వారు తర్ఫీదునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 15 శ్లోకాలు చెప్పిన మయూరి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , IB రికార్డ్స్‌లో స్థానం కైవసం చేసుకుంది.
News October 18, 2025
SKLM: అంబేడ్కర్ గురుకుల హాస్టళ్ల పనులు వేగవంతం చేయండి

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్‌సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలన్నారు.