News July 31, 2024

శ్రీకాకుళం: సర్కారు బడుల్లో ఎన్నికల సందడి 

image

సర్కారు బడుల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. మంగళవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆగస్టు 1న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 8న పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ(పి.ఎం.సీ) నిర్వహించినట్లు జీవోలో స్పష్టం చేసింది. ఆగస్టు 1న తల్లిదండ్రుల జాబితాను ప్రచురించి, ఆగస్టు 5న అభ్యంతరాలను స్వీకరించి, అదే రోజు ఓటర్ల తుది జాబితా(తల్లిదండ్రులు) ప్రచురణ చేసి ఆగస్టు 8న పీఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు.

Similar News

News November 20, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.