News December 2, 2024

శ్రీకాకుళం: సాయుధ దళాల విరాళాల పోస్టర్ ఆవిష్కరణ

image

దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాల సహాయార్థం సాయుధ దళాల పతాక దినోత్సవం కోసం విరాళాల సేకరణ పోస్టర్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం అక్షర వెలుగు పుస్తకాన్ని విడుదల చేశారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, డిఈఓ తిరుమల చైతన్య ఉన్నారు.

Similar News

News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.

News October 22, 2025

శ్రీకాకుళం: ‘ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి’

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు . జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుల మందు రహిత వ్యవసాయం లక్ష్యంగా రైతులు ముందుకు సాగాలని అన్నారు. సహజ ఎరువులు, కషాయాలు వినియోగించాలని కోరారు.

News October 21, 2025

డీజే ఓ నిశ్శబ్ద హంతకి

image

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్‌ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.