News December 2, 2024
శ్రీకాకుళం: సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech కోర్సులకు సంబంధించిన 5, 7వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. ఈ మేరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్షా ఫీజు రూ.770, ప్రాక్టికల్ ఫీజు రూ.250తో కలిపి మొత్తం రూ.1,050 చెల్లించాలి. రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 5 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
Similar News
News February 19, 2025
SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
News February 19, 2025
కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
News February 19, 2025
SKLM: పోలీసులకు దొరికిన విద్యార్థులు

శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. పాత్రునివలస టిడ్కో కాలనీలో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీక్రెట్‌గా గంజాయి తాగుతుండగా రూరల్ పోలీసులు దాడులు చేశారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఇందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు ఉన్నారు. సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ.. ఇంకా కేసు నమోదు చేయలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.