News November 15, 2024

శ్రీకాకుళం: ‘స్కాలర్ షిప్‌ కోసం అప్లై చేసుకోండి’

image

పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్‌కి సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ తెలిపారు. కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలన్నారు.

Similar News

News October 16, 2025

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన నాగబాబు

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్, నాయకులు ఉన్నారు.

News October 16, 2025

స్వచ్ఛంద్ర మరింత భాద్యతతో నిర్వర్తించాలి: కలెక్టర్

image

స్వచ్ఛంద్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం మరింత బాధ్యతగా నెరవేర్చాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛభారత్ అవార్డు పొందిన నేలబొంతు గిరిజన బాలికల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి విజయభారతికి అవార్డు లభించడం పట్ల ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేసిన సర్టిఫికెట్‌ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళంలో బుధవారం అందజేశారు.

News October 15, 2025

‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం

image

‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం మారనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గుర్తించబోయే 20 వేల ఎకరాల భూమిలో, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాలతో పాటు భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతమవుతోంది.