News May 3, 2024

శ్రీకాకుళం: స్ట్రాంగ్ రూమ్ మ్యాప్ల పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల మ్యాప్లను ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్ల, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. అనంతరం పలువురు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొన్నారు. వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ జి.ఆర్ రాధిక ఉన్నారు.

Similar News

News December 10, 2025

శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

image

పెందుర్తిలోని సుజాతనగర్‌లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్‌లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్‌ రైస్ పుల్లింగ్‌ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.

News December 10, 2025

శ్రీకాకుళం: ‘లక్ష్యాల సాధనలో ఆయా శాఖలు వేగం పెంచాలి’

image

ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం పెంచి, కీలక పనితీరు సూచికలు ఆధారంగా లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని
కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. కేపీఐ ఆధారంగానే శాఖల పనితీరు మూల్యాంకనం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి తావులేదన్నారు.

News December 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

✦శ్రీకాకుళం: సిక్కోలులో పెరిగిన చలితీవ్రత
✦విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్సీ నర్తు
✦కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వలేం: గునిపల్లి గ్రామస్థులు
✦టెక్కలి హైవే పై ఆక్సిడెంట్.. తప్పిన ప్రమాదం
✦ఎచ్చెర్లలో అగ్నిప్రమాదం
✦కంచిలి: లారీ ఢీకొని యువకుడు స్పాట్ డెడ్.
✦ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన కేంద్ర మంత్రి కింజరాపు
✦నందిగాం: గ్యాస్ అందక వినియోగదారుల ఇక్కట్లు