News May 18, 2024
శ్రీకాకుళం: స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రత: కలెక్టర్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ సూచించారు. ఈ మేరకు ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ జి.ఆర్ రాధికా పాల్గొన్నారు.
Similar News
News December 13, 2024
SKLM: ఈ నెల 16న ఎస్సీ ఉప వర్గీకరణ కమిషన్ పర్యటన
ఏపీ ప్రభుత్వం నియమించిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా (రిటైర్డ్) ఈనెల 16న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ 16న ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని, 11 గంటల నుంచి 2 గంటల వరకు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు.
News December 13, 2024
శ్రీకాకుళం: యువకుడి జీవితానికి ‘ది ఎండ్’
శ్రీకాకుళం జిల్లా IIITలో <<14862988>>చనిపోయిన <<>>ప్రవీణ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాడు. ఇటీవల కాస్త డల్ అయ్యాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. మూడు రోజుల కిందట ‘ది ఎండ్’ అని మెయిల్లో రాశాడు. బుధవారం రాత్రి 12 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత బయటకు వెళ్తుండగా ఫ్రెండ్స్ చూసి ఎక్కడికి అని ప్రశ్నించారు. వాష్ రూముకు వెళ్తున్నా అని చెప్పి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. ‘నన్ను తీసుకెళ్లండి’ అన్నవే ప్రవీణ్ చివరి మాటలు.
News December 13, 2024
ఇచ్ఛాపురం: మసీదులో హిందువులు ప్రత్యేక పూజలు
ఇచ్ఛాపురం పట్టణంలోని పీర్ల కొండపై గురువారం పీర్ల పండగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్ర-ఒడిశా నుంచి వందలాది మంది భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏటా నవంబర్‌లో నాలుగు గురువారాలు కొండపై పీర్ల పండుగ ఇక్కడ జరుగుతుంది. కొండపై ఉన్న మసీదుకు హిందువులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహిస్తారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.