News December 6, 2024

శ్రీకాకుళం: స్పోర్ట్స్ స్కూల్‌కు డీపీఆర్ పంపాలి

image

రహదారి పనులకు ప్రతిపాదనలు తక్షణమే పంపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐటీడీఎ అధికారులను ఆదేశించారు. ఐటీడీఎ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ కార్యాలయ మందిరంలో గురువారం ఆయన సమీక్షించారు. ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. 

Similar News

News November 24, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 52అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News November 24, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 127 ఫిర్యాదులు అందాయాన్నారు. ప్రతి దరఖాస్తు వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు తృప్తి కలిగించే విధంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.