News December 7, 2024
శ్రీకాకుళం: హత్యకు దారి తీసిన భూవివాదం
శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఓ వ్యక్తి శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్ (38), రాములపై నలుగురు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. రాముకు తీవ్రగాయాల్యయి. స్థానిక కుటుంబంతో భూవివాదాలపై జరిగిన గొడవలు ఈ హత్యకు కారణమని ఎస్సై జనార్దన్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News January 21, 2025
శ్రీకాకుళం: ఈ నెల 24న సుకన్య సమృద్ధి యోజన డ్రైవ్
శ్రీకాకుళం జిల్లాలోని అన్నిపోస్ట్ ఆఫీస్‌లలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 24వ తేదీన సుకన్య సమృద్ధియోజన మెగా మేళా నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. 10 సంవత్సరాలోపు బాలికలు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. ఒక సం.లో కనీసం 250/- గరిష్ఠంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18సం. నిండిన తర్వాత విద్య, వివాహం నిమిత్తం 50% వరకు నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.
News January 21, 2025
SKLM: కార్తీక్ మృతిపై మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు కార్తీక్ మృతి పట్ల టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జమ్మూలో నిన్న జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో కార్తీక్ మృతి పట్ల మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సైనికుడు కార్తీక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News January 21, 2025
రామకృష్ణాపురం: అనుమానాస్పదంగా జేసీబీ ఓనర్ మృతి
పలాస మండలం రామకృష్ణాపురం పవర్ గ్రిడ్ ప్రాంతాల్లో నీలావతి గ్రామానికి చెందిన తెప్పల ఢిల్లీరావు(50) సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆయనకు జేసీబీ ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.