News September 25, 2024

శ్రీకాకుళం: హోంగార్డుల సస్పెన్షన్: ఎస్పీ

image

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు హోంగార్డులను SP మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి సస్పెండ్ చేశారు. మరో ఐదుగురిపై నెల రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. గత నెల 21న రూ.5 వేలు లంచం తీసుకున్నడనే కారణంతో పాతపట్నం కానిస్టేబుల్ శ్యామలరావును తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా హోంగార్డుల పనితీరును పరిశీలించి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 17 మందికి నోటీసులు కూడా జారీ చేసిన విషయం విధితమే.

Similar News

News November 18, 2025

శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్‌లో కుప్ప కూలిన అధ్యాపకుడు

image

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్‌లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.

News November 18, 2025

గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

image

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.