News August 7, 2024
శ్రీకాకుళం: హౌరా- యశ్వంత్‌పూర్ రైలు రద్దు
పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా హౌరా(HWH)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహణ కారణాల రీత్యా కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8, 15వ తేదీల్లో నం.02863 HWH- YPR, నం.02864 YPR- HWH రైలును ఆగస్టు 10, 17వ తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News September 19, 2024
శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ తాడేపల్లిలోని ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులుగా తమ్మినేని సీతారాం ని ప్రకటించారు. వారికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
News September 19, 2024
శ్రీకాకుళంలో సీఎం పర్యటన వివరాలు
AP CM నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పర్యటన షెడ్యూల్‌ను గురువారం సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో మ.1:10కి కవిటి మండలం రాజపురం సమీపంలో వింధ్య గిరి వద్దకు చేరుకొని ముఖ్య నాయకులను కలుస్తారు. 1:45కు స్థానిక రామాలయాన్ని సందర్శిస్తారు. 2:15కు లబ్ధిదారులతో మాట్లాడుతారు. 3:15 వరకు రాజపురంలో సమావేశంలో పాల్గొంటారు.
News September 19, 2024
SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ తాత్కాలిక వాయిదా
ఈ నెల సెప్టెంబరు 20వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. తిరిగి శుక్రవారం 27న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగునని, ఈ తాత్కాలిక వాయిదాను (తేదీ మార్పును) విభిన్న ప్రతిభావంతులు గమనించాలని కోరారు.