News May 26, 2024
శ్రీకాకుళం: 112 టేబుళ్లు.. 173 రౌండ్లు

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జూన్ 4న జరగనుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంటు లెక్కింపు ఇక్కడే చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు 8 గదులు సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ స్థానానికి మొత్తం 112 టేబుళ్ల వద్ద 173 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. ప్రతి నియోజకవర్గానికి సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు.
Similar News
News February 17, 2025
ఇచ్చాపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్‌తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 17, 2025
SKLM: పది పరీక్షలకు 149 సెంటర్లు

శ్రీకాకుళం జిల్లాలో 28,984 మంది 10వ తరగతి ఫైనల్ పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వర్తిస్తాయని చెప్పారు. అలాగే 8 పరీక్షా కేంద్రాల్లో 807 మంది APOSS SSC పరీక్షలు రాస్తారన్నారు.
News February 17, 2025
SKLM: గ్రూప్ -2 పరీక్షలకు 15 పరీక్షా కేంద్రాలు

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్‌కు ఎచ్చెర్లలో మొత్తం 15పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. మొత్తం 5,535 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండాలన్నారు.