News August 10, 2024

శ్రీకాకుళం: 12,13,14 తేదీలలో మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం నిరుద్యోగులకు ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కెమిస్ట్రీలో ఎంఎస్సీ, బీఎస్సీ, బీటెక్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన 21నుంచి 25 ఏళ్ళ వయస్సు మధ్యగల వారు అర్హులని పేర్కొనారు. ఆగస్టు 12న పాతపట్నం మహేంద్ర డిగ్రీ కాలేజీలో, 13న పాలకొండ CL నాయుడు డిగ్రీ కళశాల, 14న శ్రీకాకుళం సన్ డిగ్రీ కళాశాలల్లో జరుగుతుందని వివరించారు.

Similar News

News April 11, 2026

టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి తిలక్‌కు పోలీసుల నోటీసులు

image

టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి పేరాడ తిలక్‌పై శుక్రవారం టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలిలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేదం ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా గురువారం రాత్రి టెక్కలిలో వైసీపీ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేయడంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు విచారణకు శనివారం తిలక్ హాజరుకావాలని నోటీసులు అందించారు.

News April 10, 2026

శ్రీకాకుళం: ఈ 8 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు

image

శ్రీకాకుళం జిల్లాలో శనివారం 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి , సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్. ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.