News August 21, 2024

శ్రీకాకుళం: 26 మంది ఎస్‌ఐలకు స్థానచలనం

image

శ్రీకాకుళం జిల్లా పోలీసుశాఖలో ఒకేసారి 26 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన మార్క్‌ను చూపించారు. చాలా ఏళ్లుగా జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్న పలువురిని విశాఖపట్నం వీఆర్‌కు పంపారు. అశోక్‌బాబు (జములూరు), మధుసూదనరావు (వీఆర్ శ్రీకాకుళం), రంజిత్ (పోలాకి) సత్యనారాయణ వీఆర్ (శ్రీకాకుళం) యాసిన్ (హిరమండలం) తదితరాలు ఉన్నారు.

Similar News

News September 13, 2024

శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

image

శ్రీకాకుళంలో లోక్ అదాలత్ మొత్తం 21 బెంచ్‌లు ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం వెల్లడించారు. జిల్లాల మొత్తం పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు 2751 గుర్తించడం జరిగిందన్నారు. ప్రీ లిటిగేషన్ కేసులు 545 ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట కార్యదర్శి, ఆర్ సన్యాసి నాయుడు ఉన్నారు.

News September 13, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ITEP కోర్సులో దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం DRBRAU నిర్వహిస్తున్న డిగ్రీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. అభ్యర్థులు www.brau.edu.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు బిఏబిఈడీలో 50 సీట్లు, బీఎస్సీబీఈడీలో 50 సీట్లు ఉన్నాయి. ఇంటర్ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఎస్సీపిటి పరీక్షల్లో స్కోర్ సాధించిన వారికి ప్రవేశాలు నిర్వహిస్తారు.

News September 13, 2024

SKLM: పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసులు బదిలీలు

image

సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బదిలీలు నిర్వహించారు. మొత్తం 238 మంది మహిళా పోలీసులు ఆన్‌లైన్‌లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 71 మందికి బదిలీలు చేయగా 149 మంది యథావిధిగా వారి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలపగా,18 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.