News May 11, 2024
శ్రీకాకుళం: 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు

జిల్లాలో 2358 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిలో 298 ప్రాంతాలలో 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ జీ.ఆర్ రాధిక గుర్తించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. హింస జరిగే అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉందన్నారు.
Similar News
News February 19, 2025
కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
News February 19, 2025
SKLM: పోలీసులకు దొరికిన విద్యార్థులు

శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. పాత్రునివలస టిడ్కో కాలనీలో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీక్రెట్‌గా గంజాయి తాగుతుండగా రూరల్ పోలీసులు దాడులు చేశారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఇందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు ఉన్నారు. సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ.. ఇంకా కేసు నమోదు చేయలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.