News October 16, 2024

శ్రీకాకుళం: ‘3,071 పనులకు రూ.261 కోట్లు మంజూరు’

image

సారవకోట మండలం అర్లి గ్రామం నుంచి గోవర్థనపురం గ్రామానికి బీటీ, సీసీ రోడ్డు పనులకు బగ్గు రమణమూర్తితో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..పల్లె పండుగ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఇప్పటివరకు రూ.261 కోట్లతో 3,071 పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మరిన్ని పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆర్డీవో కృష్ణమూర్తి, ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News November 12, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో సిక్కోలు సత్తా 

image

రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య హ్యాండ్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు విజేతలుగా నిలిచారు. గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన అండర్-19 బాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు ప్రథమస్థానం సొంతం చేసుకున్నారు. జట్టు కోచ్ మేనేజర్లుగా ఆర్.సతీష్రయుడు, జి.డిల్లీశ్వరరావు, రాజశేఖర్ వ్యవహారించారు.

News November 12, 2024

నేడు స్వర్ణకాంతులతో ఆదిత్యుని దర్శనం 

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో స్వామి వారి మూలవిరాట్ విగ్రహనికి మంగళవారం పూర్తిగా బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి, రేపు ద్వాదశి కావడంతో ప్రత్యేక అలంకరణలో  దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ డీసీ వై.భాద్రజీ వెల్లడించారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News November 11, 2024

లావేరు: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా

image

లావేరు మండలంలోని భీమునిపాలెంలో అదపాక రహదారిపై సోమవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తామాడ మెడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న కొత్తకోట గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరికి కాళ్ళు, చేతులు విరిగిపోవడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులందరినీ స్థానికులు సహాయంతో 108లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.