News July 4, 2024
శ్రీకాకుళం: 5,6 తేదీల్లో పలు రైళ్ల రద్దు

పలాస-విశాఖపట్నం మెయిన్ రైల్వే లైన్‌లో జరగనున్న భద్రత, ఆధునీకరణ పనుల నేపథ్యంలో ఈనెల 5వ తేదీన జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 5న పలాస-విశాఖ ప్యాసింజర్, గునుపూర్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-బరంపురం ప్యాసింజర్, విశాఖ-భువనేశ్వర్(ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్) రైళ్లతో పాటు 6వ తేదీన బరంపురం-విశాఖ, భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 2, 2026
శ్రీకాకుళం: ASW ఇంటిపై ఏసీబీ సోదాలు

శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ ASW జి.బాల ముకుందం ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని బృందం శ్రీకాకుళం పట్టణంలోని డీసీసీబీ కాలనీలోని ఇంట్లో ఈ తనిఖీలు నిర్వహించారు. ఆస్తి పత్రాలు, బంగారం నిల్వలు వంటివి తనిఖీలు చేసినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా సోదాలు చేసినట్లు సమాచారం.
News March 2, 2026
SKLM: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..ఇతను మీకు తెలుసా?

టెక్కలిలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. పాఠశాల సమీపంలోని రహదారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పక్కనే ఉన్న కాలువపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని టెక్కలి ఎస్ఐ కె.రాము పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ప్రమాదవ శాత్తు జరిగిందా? తెలియాల్సి ఉంది.
News March 2, 2026
శ్రీకాకుళం: 214కు చేరుకున్న డయేరియా కేసులు

శ్రీకాకుళం నగరంలో గత నెల 23 నుంచి ఆదివారం వరకు 214 డయేరియా కేసులు నమోదయినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మొత్తం 116 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 94 మంది ఉన్నారని వెల్లడించారు. ఆదివారం నలుగురు ఆసుపత్రిలో చేరారని తెలిపారు. డయేరియా అదుపులో ఉందని, అధికారుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.


