News February 4, 2025

శ్రీకాకుళం: 6న విజయ గౌరీ నామినేషన్

image

శ్రీకాకుళంలోని UTF భవనంలో సంబంధిత టీచర్ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పాల్గొన్నారు. ఆయన  మాట్లాడుతూ.. విశాఖలో ఫిబ్రవరి 6న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ నామినేషన్ వేస్తారని చెప్పారు. ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్ మూర్తి, సహాధ్యక్షులు ధనలక్ష్మి,రవికుమార్ పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 127 ఫిర్యాదులు అందాయాన్నారు. ప్రతి దరఖాస్తు వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు తృప్తి కలిగించే విధంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.

News November 24, 2025

ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియో‌ఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.