News February 4, 2025
శ్రీకాకుళం: 6న విజయ గౌరీ నామినేషన్

శ్రీకాకుళంలోని UTF భవనంలో సంబంధిత టీచర్ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఫిబ్రవరి 6న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ నామినేషన్ వేస్తారని చెప్పారు. ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్ మూర్తి, సహాధ్యక్షులు ధనలక్ష్మి,రవికుమార్ పాల్గొన్నారు.
Similar News
News February 18, 2025
SKLM: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జడ్పీ మందిరంలో MLC ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News February 18, 2025
శ్రీరాంపురంలో టవర్ ప్రారంభానికి ముహూర్తం ఎప్పుడు..?

కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాలకు ఎంతో కాలంగా సెల్ సిగ్నల్స్ సమస్య వేధిస్తూనే ఉంది. ఈ మేరకు గ్రామ పరిధిలో BSNL అధికారులు సెల్ టవర్ నిర్మాణం పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెల్ టవర్ సిగ్నల్స్ ప్రారంభం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News February 18, 2025
SKLM: గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై ఆర్డీవో సమీక్ష

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.