News March 29, 2024
శ్రీకాకుళం: 81 ఓట్లు మెజార్టీతో గెలిచారు

మీకు తెలుసా.. శ్రీకాకుళం జిల్లాలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి 81 ఓట్లు అత్యంత తక్కువ మెజార్టీతో పెంటన్నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి పెంటన్నాయుడు పోటీ చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి ఎంఎస్ నారాయణపై 81 ఓట్లతో గెలిచారు. ఇప్పటి వరకు అంతకంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి జిల్లాలో లేరు.
Similar News
News October 21, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళం నగరానికి చెందిన కే.కే. వి పురుషోత్తమరావు (కళ్యాణ్) మంగళవారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆయన నేత్రాలను సేకరించి విశాఖపట్నంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి అందజేశారు.
News October 21, 2025
శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్య శైవ క్షేత్రాలు..!

రేపటి నుంచి కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శైవ క్షేత్రాలు ముస్తాబు కానున్నాయి. ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వర దేవాలయం (జలుమూరు),
శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయం (బలగ),
సంఘమేశ్వర ఆలయం(ఆమదాలవలస),
కోటేశ్వరస్వామి ఆలయం(శ్రీకాకుళం),
ఎండల మల్లికార్జున ఆలయం (రావివలస) క్షేత్రాలకు భక్తుల తాకిడి ఉండనుంది.
News October 21, 2025
కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.