News March 29, 2024

శ్రీకాకుళం: 81 ఓట్లు మెజార్టీతో గెలిచారు

image

మీకు తెలుసా.. శ్రీకాకుళం జిల్లాలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి 81 ఓట్లు అత్యంత తక్కువ మెజార్టీతో పెంటన్నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న పాతపట్నం నుంచి పెంటన్నాయుడు పోటీ చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి ఎంఎస్ నారాయణపై 81 ఓట్లతో గెలిచారు. ఇప్పటి వరకు అంతకంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి జిల్లాలో లేరు.

Similar News

News January 19, 2025

శ్రీకాకుళం జిల్లాలో పెరిగిన చలితీవ్రత

image

శ్రీకాకుళం జిల్లాలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో పాటు మంచు అధికంగా కురుస్తుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా చలికి వణుకుతున్నారు. జిల్లాలోని టెక్కలి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు, గార మండలాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి, వేకువజాము సమయాల్లో చలిమంటలు వేస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.

News January 18, 2025

శ్రీకాకుళం: నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు 

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు హాజరైనట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పరసరామయ్య తెలిపారు. వీరిలో బాలురు 3845 మంది, బాలికలు 3402 మంది హాజరయ్యారు. జిల్లాలో 32 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1043 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు.

News January 18, 2025

శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం పట్టణం పి.యన్ కాలనీకి చెందిన తిర్లంగి అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలు దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధి నారా హర్షవర్దన్, రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకి తెలిపారు. వైజాగ్ ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రం కార్నియా సేకరించారు. ఆమె కళ్లు వేరొకరికి వెలుగునిస్తాయని కుటుంబసభ్యులు ఆనందిస్తున్నారు.