News September 23, 2024

శ్రీకాకుళం: 85 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. చట్ట పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News October 10, 2024

కలెక్టర్, ఎస్పీతో చర్చించిన ఎంపీ కలిశెట్టి

image

విజయనగరం పైడితల్లి ఉత్సవాల నిర్వహణపై భక్తుల సలహాలు సూచనలు కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో చర్చించారు. అమ్మవారి ఉత్సవాలకు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News October 9, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

News October 9, 2024

కొవ్వాడ ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలి

image

కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.