News April 4, 2024
శ్రీకాకుళం: 93 వేల మందికి నగదు అందజేత

శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల పింఛన్లకు సంబంధించి మొత్తం 3,21,662 మందికి సొమ్ము విడుదల చేశారు. బుధవారం 93,669 మందికి(29.12శాతం) పింఛన్ నగదు అందించారు. ఇంకా 2,27,993 మందికి డబ్బులను అందించాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ ప్రాంతాల్లో టెంట్లు, నీటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు అసౌకర్యానికి గురయ్యారు.
Similar News
News April 20, 2025
ఇచ్ఛాపురంలో నేడు కేంద్రమంత్రి పర్యటన

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.
News April 19, 2025
పైడిభీమవరంలో మహిళ దారుణ హత్య

రణస్థలం మండలం పరిధిలో పైడిభీమవరం పంచాయతీ గొల్లపేటకు చెందిన భవాని(26)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతురాలు పైడిభీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తుంది. శనివారం సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వస్తుండగా చిన్న చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.
News April 19, 2025
కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.