News August 17, 2024
శ్రీకాకుళం: APEAP CET మూడో విడత కౌన్సెలింగ్

ఏపీఈఏపీ సెట్-2024 ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌లు పూర్తవ్వగా హాజరు కాని అభ్యర్థులుకు మూడో విడత కౌన్సెలింగ్‌కు మరో అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం కళాశాలలో సీటు లభించిన విద్యార్థులు బ్రాంచీలు మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. సమస్య ఉంటే శ్రీకాకుళం ప్రభుత్వం పాలిటెక్నిక్‌ను సంప్రదించాలని సమన్వయకర్త దామోదర్ రావు తెలిపారు.
Similar News
News November 13, 2025
ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్‌లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.
News November 13, 2025
మస్కట్‌లో సిక్కోలు యువతి అనుమానాస్పద మృతి

ఆమదాలవలస మండలం వెదుర్లువలసకి చెందిన నాగమణి (28) జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె వారం రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేసి అక్కడ తనను వేధిస్తున్నారని చెప్పిందని, ఇంతలోనే ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు ఆమె తల్లి తెలిపారు.MLA రవికుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
News November 13, 2025
సరుబుజ్జిలి: చెరువులో మహిళ మృతదేహం లభ్యం

సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఏ.శకుంతల (48) అనే మహిళ బుధవారం గ్రామ సమీపంలోని చెరువులో మృతి చెందింది. ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ B.హైమావతి ఘటప స్థలాని చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.


