News August 6, 2024

శ్రీకాకుళం: B.Tech పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ ఏయూ B.Tech రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు ఈ నెల 13వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News July 9, 2025

కిక్కిరిసిన పలాస-ఆమదాలవలస ట్రైన్

image

పలాస-ఆమదాలవలస ప్యాసింజర్ రైలు బుధవారం ప్రయాణికులతో సంద్రాన్ని తలపించింది. సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సింహాచలం తరలి రావడంతో రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. ట్రైన్‌లో కనీసం కాలు పెట్టుకునేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేయాలని కోరారు.

News July 9, 2025

శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

image

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.

News July 9, 2025

హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

image

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.