News April 26, 2024
శ్రీకాకుళం: CPI మేనిఫెస్టో విడుదల
మే13న జరిగే ఎన్నికలలో BJP, BJPతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పార్టీలను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్‌లో CPI ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో చాపర సుందరలాల్, యుగంధర్, డోల శంకరరావు, తమిరి తిరుపతిరావు, వెంకటరావు తదితరులు ఉన్నారు.
Similar News
News November 25, 2024
SKLM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఆ గడువు 25వ తేదీతో ముగుస్తుంది. రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు, రూ.1500 అపరాధ రుసుముతో ఈనెల 28 వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
News November 25, 2024
సీతంపేట: విషాదం మిగిల్చిన వనభోజనం
సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News November 25, 2024
SKLM: అయ్యప్పస్వామి భక్తులకు ప్రత్యేక రైలు
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి నేరుగా శబరిమల (కొల్లం) వరకు ప్రత్యేక రైలును డిసెంబరు 1 నుంచి జనవరి 19 తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని, రైలు ప్రారంభించడంపై సంతోషంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రైలు మంజూరు చేసినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరికీ సురక్షితంగా, శుభప్రదమైన యాత్ర జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.