News April 10, 2025
శ్రీకాకుళం DMHOగా సుజాత

శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Similar News
News November 27, 2025
భార్యను చంపిన కేసులో భర్తకి జీవిత ఖైదు: శ్రీకాకుళం ఎస్పీ

భార్యను చంపిన కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించినట్లు గురువారం శ్రీకాకుళం ఎస్పీ కె.విమహేశ్వరరెడ్డి తెలిపారు. 2018 మార్చి 14వ తేదీన పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు రమణమ్మను అనుమానంతో భర్త వెంకటరమణ కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఘటనపై ముద్దాయిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్పై బయటకు వచ్చి పరారీలో ఉన్న అతడిని తాజాగా కోర్టులో హాజరుపరచగా జీవిత ఖైదు విధించారు.
News November 27, 2025
SKLM: బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేర్పులు, మార్పులు పూర్తి చేయాలి

8 నియోజకవర్గాల్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్ లిస్టులో చేర్పులు, మార్పులు, దిద్దుబాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల్లో గల EROలు, AEROలతో మాట్లాడి ఫారం 6,7,8లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నివేదికలు అందించాలన్నారు.
News November 27, 2025
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.


