News April 10, 2025

శ్రీకాకుళం DMHOగా సుజాత

image

శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Similar News

News January 22, 2026

SKLM: ఈ నెల 23న కబడ్డీ పోటీలు ప్రారంభం

image

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 23న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ జిల్లాల నుంచి జట్లు ఈ ఆటల్లో తలపడనున్నాయి. శనివారం కబడ్డీ ఫైనల్స్ పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము, సంగీడులు, ఉలవబస్తాల పోటీలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులు తరలిరావాలని అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

News January 22, 2026

SKLM: ‘లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం’

image

సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లు కేవలం వైద్య అవసరాలకే పరిమితం చేయాలన్నారు. మితిమీరితే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. DMHO అనిత ఉన్నారు.