News November 6, 2024

శ్రీకాకుళం: IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (త్రిబుల్ ఐటీ) విద్యార్థిని  ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విష ద్రావణం తాగిన విద్యార్థిని గుర్తించిన వసతి గృహం సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్న ఆమెది సొంత ప్రాంతం నంద్యాల.

Similar News

News December 4, 2025

ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

image

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.

News December 4, 2025

SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

image

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.

News December 4, 2025

శ్రీకాకుళం: ‘గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు’

image

ప్రభుత్వం గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేషన్‌కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ ) వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్రం యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ భాగం ఏర్పాటు చేశారు. డీడీఓగా అరుంధతి దేవిని నియమించారు. జిల్లాలో 657 గ్రామ సచివాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి.