News November 6, 2024

శ్రీకాకుళం: IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (త్రిబుల్ ఐటీ) విద్యార్థిని  ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విష ద్రావణం తాగిన విద్యార్థిని గుర్తించిన వసతి గృహం సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్న ఆమెది సొంత ప్రాంతం నంద్యాల.

Similar News

News December 6, 2024

SKLM: సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్

image

సిక్కోలు జిల్లా వాసి ఒకరు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. జలుమూరు(M) లింగాలవలసకు చెందిన జి.సంతోష్(34) HYDలో క్యాబ్ నడుపుతూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. స్కూల్ ఫీజ్ కోసం చింటూ అనే వ్యక్తి దగ్గర రూ.60వేలు అప్పు తీసుకున్నారు. 3నెలలు వడ్డీ చెల్లించాక కారు రిపేర్‌ కావడంతో డబ్బులు కట్టలేకపోయారు. చింటూ నుంచి వేధింపుల రావడంతో మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకున్నాడు. నిన్న కేసు నమోదైంది.

News December 6, 2024

ఎచ్చెర్ల: ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం

image

ఎచ్చెర్లలోని పోలీస్ మైదానంలో 62వ హోంగార్డు ఆవిర్భవ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలోని హోంగార్డుల సేవలను ఎస్పీ కొనియాడారు. వాళ్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News December 6, 2024

జగన్‌తో సమావేశానికి ధర్మాన, దువ్వాడ గైర్హాజరు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ బుధ, గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడంతో పలు అంశాలపై చర్చించారు. ఇంతటి కీలకమైన సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. కీలకమైన సమావేశానికి సైతం గౌర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఈ సమావేశానికి రాలేదు.