News August 7, 2024
శ్రీకాకుళం: ITI ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తు
శ్రీకాకుళం జిల్లాలో ఐటిఐలో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్. సుధాకర్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌లో మిగిలిన సీట్ల ప్రవేశాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదీతో గడువు ముగుస్తుందని ఆయన చేప్పారు.
Similar News
News September 19, 2024
సిక్కోలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో రేపు జరగాల్సిన సీఎం చంద్రబాబు పర్యటన రద్దు చేయబడినట్లు అధికారికంగా గురువారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలం లేనందున ఈ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సీఎం చంద్రబాబు పర్యటనకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే.
News September 19, 2024
శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ తాడేపల్లిలోని ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులుగా తమ్మినేని సీతారాం ని ప్రకటించారు. వారికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
News September 19, 2024
శ్రీకాకుళంలో సీఎం పర్యటన వివరాలు
AP CM నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పర్యటన షెడ్యూల్‌ను గురువారం సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో మ.1:10కి కవిటి మండలం రాజపురం సమీపంలో వింధ్య గిరి వద్దకు చేరుకొని ముఖ్య నాయకులను కలుస్తారు. 1:45కు స్థానిక రామాలయాన్ని సందర్శిస్తారు. 2:15కు లబ్ధిదారులతో మాట్లాడుతారు. 3:15 వరకు రాజపురంలో సమావేశంలో పాల్గొంటారు.