News June 28, 2024
శ్రీకాకుళం: MA రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఫిబ్రవరి-2024లో నిర్వహించిన MA ఇంగ్లిష్ మొదటి సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ లో చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News December 1, 2024
శ్రీకాకుళం: ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్ కళా వేదికలో ఆదివారం ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిడ్స్ రైతు సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. వ్యాధి నియంత్రణకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుంది.
News December 1, 2024
IPLకు విజయ్.. టెక్కలిలో అభినందనలు ఫ్లెక్సీ
టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్- ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక కావడం పట్ల టెక్కలిలో విజయ్ స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రౌండ్ ప్లేయర్స్ విజయ్‌కు అభినందనలు తెలుపుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రోడ్డులో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి యువకుడు త్రిపురాన విజయ్‌కు “All The Best” చెప్తూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.
News December 1, 2024
SKLM: ఆ తల్లి కష్టం ఎవరికీ రాకూడదు..!
భోగాపురం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ జయేశ్ కన్నీటి గాథ ఇది. శ్రీకాకుళానికి చెందిన జయేశ్ తండ్రి సైతం ప్రమాదంలోనే చనిపోయారు. తల్లి సున్నపు వీధిలో టీస్టాల్ నిర్వహిస్తూ జయేశ్‌ను కష్టపడి పెంచింది. ఈక్రమంలో అతను కౌశిక్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. విశాఖ విమానాశ్రయానికి బయల్దేరగా మార్గమధ్యలో చనిపోయారు. అప్పుడు భర్త, ఇప్పుడు కొడుకు ప్రమాదంలోనే కన్నుమూయడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది.