News December 15, 2024
శ్రీకాకుళ: జిల్లాలో 2,606 నీటి సంఘాలకు ఎన్నికలు పూర్తి
జిల్లాలోని BRR వంశధార, నారాయణపురం ఆనకట్ట, మైనర్ ఇరిగేషన్ కింద మొత్తం 2,628 నీటి సంఘాల ప్రాదేశిక స్థానాలకు శనివారం ఎన్నికలు జరగగా 2606 స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. పలు కారణాలతో ఇంకా 22 ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 344 నీటి సంఘాలకు గాను రెండు మినహా మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా ఎన్నికల ఘట్టం ముగిసింది. గెలుపొందిన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
Similar News
News January 24, 2025
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్‌లో రెండు పూటలా రిజర్వేషన్
కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్‌లో నాలుగు నెలలుగా నెలకొన్న సమస్యకు శుక్రవారం పరిష్కారం లభించింది. సోంపేట రైల్వేస్టేషన్‌లో రెండో పూట రిజర్వేషన్ కౌంటర్‌ను రైల్వే అధికారులు పునఃప్రారంభించారని ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ జెడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు నెలలుగా నెలకొన్న సమస్య పరిష్కారం పట్ల రైల్వే కమిటీ సభ్యులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
News January 24, 2025
పాతపట్నం: యువతి నుంచి ఫోన్ కాల్.. నిండా ముంచారు
హనీ ట్రాప్‌తో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు మోసపోయాడు. ఈనెల 18న ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా.. మరోసారి ఆమె నుంచి ఫోన్ వచ్చింది. ఇంతలో సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని యువతి చెప్పగా.. అతడు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు ఆయనను బైక్ ఎక్కించుకొని విజయనగరం వైపు తీసుకుపోయారు. మధ్యలో ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు దోచుకున్నారు.
News January 23, 2025
జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ
జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.