News February 16, 2026

‘శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతిపై ఫేక్ వార్తలు నమ్మవద్దు’

image

శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతిపై ఫేక్ వార్తలు నమ్మవద్దు అని AP FACT CHECK తెలియజేసింది. ‘ఆలయ ప్రాంగణంలో గాలిగోపురం వద్ద<<19154471>> ఒక మహిళ అచేతనంగా పడిఉన్నారనే<<>> సమాచారం మేరకు డ్యూటీ డాక్టర్ అక్కడకు చేరుకొని CPR ఇచ్చారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఎక్కడా వైద్యుల, 108 వాహన నిర్లక్ష్యం లేదు. భక్తులను భయభ్రాంతులకు గురిచేసే తప్పుడు వార్తలు నమ్మవద్దు.’ అని తెలిపింది.

Similar News

News March 17, 2026

30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

image

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్‌ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.

News March 17, 2026

విశాఖ: సరెండర్ తర్వాత భవానీ శంకర్‌కు పోస్టింగ్

image

విశాఖలో DROగా పనిచేసి సరెండర్ అయిన భవానీ శంకర్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతేడాది RDO శ్రీలేఖతో విభేదాల కారణంగా ఇద్దరినీ సరెండర్ చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 17, 2026

ప్రమాదాలు తగ్గాయి.. ఇదే చొరవ కొనసాగించాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తగ్గాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 2024లో 1,046 ప్రమాదాలు జరిగాయని, 2025 లో 910 జరిగాయని తెలిపారు. మరణాలు కూడా 19 శాతం తగ్గాయని చెప్పారు.