News March 22, 2025
శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
Similar News
News November 27, 2025
నంద్యాల ఫిజియోథెరపిస్టుకు జాతీయస్థాయి పురస్కారం

నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డాక్టర్ శివ బాలి రెడ్డి జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని పొందారు.
సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి గాను ఆయనకు ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం లభించింది. జిల్లాలోని ప్రముఖులు డా. శివ బాలి రెడ్డిని అభినందించారు.
News November 27, 2025
భార్యను చంపిన కేసులో భర్తకి జీవిత ఖైదు: శ్రీకాకుళం ఎస్పీ

భార్యను చంపిన కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించినట్లు గురువారం శ్రీకాకుళం ఎస్పీ కె.విమహేశ్వరరెడ్డి తెలిపారు. 2018 మార్చి 14వ తేదీన పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు రమణమ్మను అనుమానంతో భర్త వెంకటరమణ కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఘటనపై ముద్దాయిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్పై బయటకు వచ్చి పరారీలో ఉన్న అతడిని తాజాగా కోర్టులో హాజరుపరచగా జీవిత ఖైదు విధించారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.


