News February 6, 2025
శ్రీకాళహస్తి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కత్తితో దాడి

తొట్టంబేడు (మం) కన్నలి ST కాలనీలో బుధవారం రాత్రి కాంతారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. పొయ్యి కొత్తూరుకు చెందిన కాంతారావు కన్నలి ST కాలనీకి చెందిన లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి మధ్య గొడవలు కాగా లావణ్య పుట్టింటికి వచ్చింది. బుధవారం మళ్లీ గొడవపడిన కాంతారావు కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అడ్డం వచ్చిన లావణ్య అక్క సుకన్య, చెల్లెలు సుభాషిణిపై దాడి చేశాడు.
Similar News
News October 29, 2025
అత్యవసరమైతే 100కి కాల్ చేయండి: ఎస్పీ నరసింహ

మొంథా తుపాను ప్రభావంతో సూర్యాపేట జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే డయల్ 100 లేదా సూర్యాపేట కంట్రోల్ రూమ్ నంబర్ 8712686026కు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.
News October 29, 2025
మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News October 29, 2025
నల్గొండ: మొంథా తుఫాన్.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలిచ్చారు. అధికారులు విధి నిర్వహణలో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. రహదారులు, విద్యుత్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, కంట్రోల్ రూమ్కు 18004251442 సమాచారం అందించాలని తెలిపారు.


