News October 19, 2024
శ్రీకాళహస్తి: ప్రేమోన్మాది ఘాతుకం.. లవర్‌పై బ్లేడ్‌తో దాడి

శ్రీకాళహస్తి మండలం చోడవరానికి చెందిన ముధుసూదన్‌రెడ్డి(22), అదే గ్రామానికి చెందిన యువతి(21) నెల్లూరు జిల్లాలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు. ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. IT కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇటీవల మద్యం, ఇతర వ్యసనాలకు బానిసవడంతో మధుసూదన్‌రెడ్డిని యువతి దూరం పెట్టింది. కోపం పెంచుకున్న యువకుడు గురువారం సాయంత్రం SR నగర్‌లో యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు.
Similar News
News July 11, 2025
చిత్తూరు: వర్షాలు లేక తగ్గిన ఖరీఫ్ పంటల సాగు

ఉ.చిత్తూరు జిల్లా రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కొన్ని మండలాల్లో వర్షాల కారణంగా సాగు ప్రారంభించారు. గతేడాదితో పోల్చితే వేరుశనగ, వరి సాగు 50 శాతం మాత్రమే ఉందని సమాచారం. వరిని రైతులు 11వేల హెక్టార్లకు 4వేల హెక్టార్లలో సాగు ప్రారంభించారు. వేరుశనగ 36 వేల హెక్టార్లకుగాను సుమారు 1,000 పైగా హెక్టార్లలో సాగు ప్రారంభమైంది. త్వరలో వర్షం లేకపోతే సాగు కష్టమే అంటున్నారు రైతులు.
News July 11, 2025
త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
News July 11, 2025
కుప్పం రైతులకు రూ.25.90 కోట్ల నష్టపరిహారం

కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.