News February 16, 2025

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు తమిళనాడు CMకు ఆహ్వానం

image

శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా MLA బొజ్జల సుధీర్ రెడ్డి శనివారం తమిళనాడు CM స్టాలిన్‌ను ఆహ్వానించారు. ముందుగా ఆయన స్టాలిన్‌ను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు. ఈనెల 21వ తేదీన ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని MLA ఆహ్వానించారు.

Similar News

News November 10, 2025

జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

image

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.

News November 10, 2025

నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్‌కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.

News November 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 10, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.