News February 16, 2025

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు హీరో ప్రభాస్‌కు ఆహ్వానం

image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రముఖ సినీ నటుడు  ప్రభాస్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. ఆదివారం ప్రభాస్‌ను కలిసిన ఎమ్మెల్యే.. ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా ఇప్పటికే ప్రభాస్ మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను ఆధారంగా తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

Similar News

News March 12, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 12, 2026

MNCL: క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

image

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్నింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

News March 12, 2026

సిరిసిల్ల: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన అంబులెన్స్

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కామారెడ్డి వెళ్లేందుకు బస్టాండ్‌లోకి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన 102 అంబులెన్స్ అదుపుతప్పి బస్సును ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.