News July 27, 2024
శ్రీకాళహస్తి: భారీ ఐరన్ పైపు మీదపడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు ఐరన్ పైపు మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. స్థానికుల కథనం.. రాచగున్నేరి సమీపంలోని ఓ కంపెనీలో లారీలోకి పైపులు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ ఐరన్ పైపు మీద పడటంతో కాపు గున్నేరు గ్రామానికి చెందిన ప్రసాద్ (48) తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 7, 2026
9 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 6, 2026
చిత్తూరు: యూరియా వాడకంతో పాలు తగ్గుతాయి..!

ఐరాల మండలం చిన్నకంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ యూరియా వాడటంతో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. తగిన మోతాదులో యూరియా వాడితేనే పంట దిగుబడి పెరుగి.. చీడ పీడలు తగ్గుతాయని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసానికి యూరియా వాడకంతో పాలు, వెన్న శాతం తగ్గుతాయని తెలిపారు.
News January 6, 2026
చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.


