News July 2, 2024
శ్రీకాళహస్తి: మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరార్

శ్రీకాళహస్తి: తొండమనాడు మార్గం అమ్మపాళెం సమీపంలో ఓ మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కుని ఇద్దరు దుండగులు పరారైన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. అమ్మపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళ వాకింగ్ చేస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు బైక్‌పై వచ్చి మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2026
CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 27, 2026
చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.
News February 27, 2026
74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.


