News June 24, 2024
శ్రీకాళహస్తి: లారీ ఢీకొని జూనియర్ లైన్మెన్ స్పాట్ డెడ్

లారీ ఢీకొనడంతో విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న హేమంత్ దుర్మరణం చెందారు. భాస్కరపేటలో నివాసముంటున్న హేమంత్ ఆదివారం మిట్టకండ్రిగలోని సొంతింటికి వెళ్లి రాత్రి బైకుపై భార్య దివ్యతో కలిసి బయలుదేరారు. హౌసింగుబోర్డు కాలనీ వద్ద బైకును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 17, 2025
పక్కా ప్లాన్‌తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్‌ను పక్కా ప్లాన్‌తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.